My Home: మై హోం రామేశ్వరరావు నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు

  • నందగిరి హిల్స్ లోని నివాసంలో సోదాలు
  • నగరంలో ఉన్న మై హోం కార్యాలయాలపైనా దాడులు
  • పలు పత్రాల పరిశీలన

ఇటీవలే టీవీ9 చానల్ యాజమాన్య వివాదం ద్వారా వార్తల్లోకెక్కిన మై హోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్, నందగిరి హిల్స్ లోని రామేశ్వరరావు నివాసంపైనే కాకుండా, నగరంలోని పలుచోట్ల ఉన్న మై హోం కార్యాలయాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు పత్రాలను పరిశీలించి, ఆస్తుల విలువను మదింపు చేస్తున్నట్టు సమాచారం. గతకొంతకాలంగా పారిశ్రామికవేత్తలుగా మారిన రాజకీయనేతలపైనా, రాజకీయనేతలతో సన్నిహిత సంబంధాలున్న పారిశ్రామికవేత్తలపైనా ఐటీ విభాగం దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

My Home
Rameswar Rao
Hyderabad
IT
Raids
  • Loading...

More Telugu News