Vangaveeti Ranga: ఫూటుగా మద్యం తాగి.. వంగవీటి రంగా మనిషినంటూ స్థానికులపై దాడి

  • మద్యం సీసాతో గాయపరుచుకున్న యువకుడు
  • భయబ్రాంతులకు గురైన స్థానికులు
  • పోలీసులు వచ్చే లోగా పరారు

వంగవీటి రంగా మనిషినంటూ ఓ వ్యక్తి స్థానికులను భయాందోళనలకు గురి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. ఫూటుగా మద్యం తాగిన ఓ యువకుడు తాను వంగవీటి రంగా మనిషినని చెప్పి స్థానికులపై దాడికి పాల్పడటమే కాకుండా మద్యం సీసాలతో తన తలను గాయపరుచుకుంటూ స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు. దీంతో స్థానికులు కొందరు అప్రమత్తమై అతడిని పట్టుకుని గట్టిగా అడగ్గా, తనది విజయవాడ అని చెప్పుకొచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోగా అక్కడి నుంచి పరారయ్యాడు.

Vangaveeti Ranga
West Godavari District
Eluru
Vijayawada
Police
  • Loading...

More Telugu News