YSRCP: నెలరోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం చంద్రబాబు, లోకేశ్ అజ్ఞానానికి నిదర్శనం: శ్రీకాంత్ రెడ్డి

  • రాష్ట్రంలో విద్యుత్ కోతలు, విత్తనాల కొరత అవాస్తవం
  • చంద్రబాబులా చీకట్లో ఒప్పందాలు ఉండవు
  • అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ విలువలను గౌరవిస్తాం

రహస్య జీవోలు విడుదల చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని, చంద్రబాబు తరహాలో చీకట్లో ఒప్పందాలేవీ ఉండవని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పారదర్శకంగా, అవినీతిరహితమైన పాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఏపీలో విద్యుత్ కోతలు, ఏపీలో విత్తన కొరత అంటూ చంద్రబాబు, లోకేశ్ చేస్తున్న ఆరోపణలు నిజం కాదని, నెలరోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం చంద్రబాబు, లోకేశ్ ల అజ్ఞానానికి నిదర్శనం అని పేర్కొన్నారు. చంద్రబాబులా కాకుండా తాము రాజ్యాంగ విలువలను గౌరవిస్తామని, అసెంబ్లీలో చట్టాలు తుంగలో తొక్కే పరిస్థితి ఉండదని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

YSRCP
Chandrababu
Nara Lokesh
Srikanth Reddy
  • Loading...

More Telugu News