Sachin Tendulkar: అంబటి రాయుడు రిటైర్మెంటుపై సచిన్ స్పందన

  • బీసీసీఐ తీరు పట్ల రాయుడు అసంతృప్తి!
  • అన్ని ఫార్మాట్లలో ఆటకు వీడ్కోలు
  • ఆల్ ది బెస్ట్ చెప్పిన క్రికెట్ దేవుడు

ఎంతో ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్న తెలుగుతేజం అంబటి రాయుడు ఉన్నట్టుండి ఆటకు వీడ్కోలు పలకడాన్ని క్రికెట్ ప్రపంచం నమ్మలేకపోయింది. ప్రపంచకప్ లో ఆడే టీమిండియాలో స్థానం దక్కకపోవడం, చివరికి వెయిటింగ్ లిస్టులో ఉన్న తనను పక్కనబెట్టి, అనూహ్యరీతిలో మయాంక్ అగర్వాల్ ను ఇంగ్లాండ్ పంపించడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.

బీసీసీఐ తన పట్ల చూపిస్తున్న వైఖరికి నిరసనగానే రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడన్నది అందరికీ తెలిసిన విషయమే. దీనిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. "అంబటీ, భారత క్రికెట్ కు నీవు చేసిన సేవలకు కృతజ్ఞతలు. ముంబయి ఇండియన్స్ కు నీవు ఆడిన సమయంలో ఎన్నో మధురస్మృతులున్నాయి. నీ సెకండ్ ఇన్నింగ్స్ లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను" అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.

Sachin Tendulkar
Ambati Rayudu
BCCI
Cricket
World Cup
  • Loading...

More Telugu News