Telangana: ప్రజల్లో ఉండేటోడే నాయకుడు.. ఓట్లప్పుడు మాత్రమే వచ్చేటోడు నాయకుడు కాదు!: హరీశ్ రావు

  • సిద్దిపేటలో పర్యటించిన హరీశ్ రావు
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • యువత సెల్ ఫోన్ కు బానిస కావొద్దని సూచన

ఎన్నికల్లో గెలిచాక ఐదేళ్ల పాటు ప్రజల మధ్య ఉండి పనిచేసేవాడే నాయకుడని సిద్దిపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు తెలిపారు. అంతేతప్ప ఓట్లప్పుడు మాత్రమే వచ్చేటోడు నాయకుడు కాదని వ్యాఖ్యానించారు. సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడ్ గ్రామంలో రెడ్డి సంక్షేమ భవనం, రజక, గౌడ సంఘ భవనాలు, లైబ్రరీ, ఎస్సీ మాదిగ కమ్యూనిటీ హాల్‌ను హరీశ్ రావు ప్రారంభించారు. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. యువత సెల్ ఫోన్ వ్యసనానికి బానిస కాకూడదని అన్నారు. టెక్నాలజీని మంచి కోసమే వాడాలన్నారు. నియోజకవర్గంలో త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని పేర్కొన్నారు. అలాగే ఇరుకోడ్ లో పశువుల ఆసుపత్రి, శ్మశానవాటిక నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

Telangana
TRS
Harish Rao
SIDDIPET
LEADER
youth
cellphone
  • Loading...

More Telugu News