Russia: నింజా ట్యాంకు.. పండ్లు కోసి, డ్రాయింగ్స్ వేస్తున్న రష్యన్ టీ-80 యుద్ధ ట్యాంకు!

  • రష్యా మిలటరీ ఎక్స్ పోలో ఆసక్తికర దృశ్యం
  • యుద్ధ ట్యాంకు కచ్చితత్వాన్ని ప్రదర్శించిన సైన్యం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

యుద్ధట్యాంకు అనగానే ఎవరికైనా రణరంగంలో శత్రువుల స్థావరాలను ధ్వంసం చేస్తూ దూసుకెళ్లే శకటమే గుర్తుకు వస్తుంది. ప్రపంచంలోని చాలాదేశాలు ఈ యుద్ధ ట్యాంకులను తమ అమ్ములపొదిలో చేర్చుకున్నాయి. తాజాగా రష్యాలోని మాస్కోలో జరిగిన మిలటరీ ఎక్స్ పో-2019లో రష్యన్ ఆర్మీ ప్రదర్శించిన టీ-80 యుద్ధ ట్యాంకు సందర్శకులను విపరీతంగా అలరించింది.

ఎందుకంటే యుద్ధం చేసే విషయాన్ని పక్కన పెడితే ఈ ట్యాంకు ఓ కత్తి సాయంతో పండ్లను అత్యంత కచ్చితత్వంతో కోయగలదు. గ్లాసు నిండా నీటిని బ్యారెల్ పై పెట్టుకుని కింద పడకుండా దూసుకెళ్ల గలదు. అంతేకాదు.. అందమైన డ్రాయింగ్స్ కూడా వేయగలదు. ప్రస్తుతం ఈ యుద్ధ ట్యాంకు నింజా విన్యాసాల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని మీరూ చూసేయండి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News