Andhra Pradesh: పక్కా ప్రణాళికతో పనిచేద్దాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేద్దాం!: నారా లోకేశ్

  • మంగళగిరి పార్టీ ఆఫీసులో టీడీపీ శ్రేణులతో భేటీ
  • మండలాలవారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
  • సమావేశం వివరాలను ట్విట్టర్ లో పంచుకున్న టీడీపీ నేత

తెలుగుదేశం పార్టీ అగ్ర నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఈరోజు మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా మంగళగిరి టీడీపీ ఆఫీసులో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని విజయతీరాలకు చేర్చడంపై పార్టీ శ్రేణులతో లోకేశ్ విస్తృతంగా చర్చించారు. పక్కా  ప్రణాళికతో పనిచేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే నియోజకవర్గంలో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా పనిచేద్దామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తనను కలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలతో దిగిన ఫొటోలను లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
mangalagiri
meeting
Telugudesam leaders
Guntur District
local body elections
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News