India: ‘ఆరెస్సెస్ ఫర్ డమ్మీస్’.. వీడియోను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ!
- ఆరెస్సెస్ చరిత్రను వివరించే యత్నం
- స్వాతంత్ర్య ఉద్యమంలో ఆ సంస్థ పాల్గొనలేదని వ్యాఖ్య
- బ్రిటిష్ వారికి ఊడిగం చేశారని విమర్శ
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)పై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడూ మండిపడుతూనే వుంటారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆరెస్సెస్ పాల్గొనలేదనీ, బ్రిటీష్ పాలకులకు ఆరెస్సెస్ పెద్దలు ఊడిగం చేశారని విమర్శిస్తూ ఉంటారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ కూడా ఆరెస్సెస్ ను తీవ్రంగా తప్పుపడుతుంటారు.
ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ చరిత్రను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓ వీడియోను విడుదల చేసింది. జాతిపిత మహాత్మాగాంధీ మొదలుపెట్టిన సత్యాగ్రహలో పాల్గొనవద్దని ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ తమ కార్యకర్తలను ఆదేశించారని కాంగ్రెస్ ఆ వీడియోలో తెలిపింది. బ్రిటిష్ పోలీసులుగా, ఉద్యోగులుగా చేరేలా భారతీయులను వీరు ప్రోత్సహించారని విమర్శించింది. అంతేకాకుండా మహాత్మాగాంధీ హత్యలోనూ ఆరెస్సెస్ ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వీడియోను మీరూ చూడండి.