Andhra Pradesh: అల్లూరి సీతారామరాజు పోరాటం అన్ని తరాలకూ స్ఫూర్తిదాయకం!: చంద్రబాబు

  • అల్లూరి గిరిజనుల కోసం పోరాడారు
  • తెలుగువారి దేశభక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కుల కోసం పోరాడారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన చేసిన పోరాటం అన్ని తరాలకు స్ఫూర్తిదాయకం అని వ్యాఖ్యానించారు. అల్లూరి ప్రాణత్యాగం తెలుగువారి దేశభక్తిని, పోరాట పటిమను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత ఆయనకు నివాళులు అర్పించారు.

ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘గిరిజన హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం అన్ని తరాలకూ స్ఫూర్తిదాయకం. ఆ అమరవీరుని ప్రాణత్యాగం తెలుగువారి దేశభక్తిని, పోరాట పటిమను ప్రపంచానికి చాటింది. చిరస్మరణీయుడు అల్లూరి జయంతి సందర్భంగా ఆ మహనీయుని చరిత్రను మననం చేసుకుందాం’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Twitter
alluri
sitaramaraju
birth anniversary
  • Loading...

More Telugu News