Andhra Pradesh: ఏపీ-తెలంగాణ కలిసి పనిచేయాలి.. కేంద్రం నుంచి నిధులను సాధించుకోవాలి!: ఎర్రబెల్లి దయాకర్ రావు

  • జగన్-కేసీఆర్ లు సుపరిపాలన అందిస్తున్నారు
  • అభివృద్ధిలో ఇరురాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలి
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎర్రబెల్లి

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు సుపరిపాలన అందిస్తున్నారని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఏపీ, తెలంగాణలు అభివృద్ధిలో కలిసి ముందుకు సాగాలనీ, పరస్పరం సహకరించుకుని కేంద్రం నుంచి నిధులు సాధించుకోవాలని వ్యాఖ్యానించారు.

అందుబాటులో ఉన్న వనరులను ఇరు రాష్ట్రాల ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

Andhra Pradesh
Telangana
yerrabelli
dayakar rao
Jagan
KCR
Chief Minister
  • Loading...

More Telugu News