Amarnath yatra: అమర్‌నాథ్ యాత్రలో విషాదం.. కడప జిల్లా భక్తురాలి మృతి

  • గుండెపోటుతో మృతి చెందిన భాగ్యమ్మ
  • రేపు విమానంలో స్వస్థలానికి మృతదేహం
  • యాత్ర సాఫీగా సాగుతోందన్న ఐటీబీపీ

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భాగ్యమ్మ మృతి చెందింది. బల్తాల్ బేస్ క్యాంపులో ఆమె గుండెపోటుతో మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. రేపు ఆమె మృతదేహాన్ని విమానంలో కడప పంపనున్నట్టు అమర్‌నాథ్ బోర్డు అధికారులు తెలిపారు.

మరోవైపు, అమర్‌నాథ్ యాత్రికుల్లో 15 మంది ఆక్సిజన్ అందక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడారు. అమర్‌నాథ్ యాత్ర సాఫీగా సాగుతున్నట్టు ఐటీబీపీ తెలిపింది. 46 రోజులపాటు సాగనున్న అమర్‌నాథ్ యాత్ర ఈ నెల 1న ప్రారంభమైంది. ఆగస్టు 15న శ్రావణ పూర్ణిమతో ముగుస్తుంది.  

Amarnath yatra
Kadapa
proddutur
devotee
  • Loading...

More Telugu News