Andhra Pradesh: వైసీపీ సహా అన్ని పార్టీల నేతలు మాతో టచ్ లో ఉన్నారు: బీజేపీ నేత మాధవ్

  • బీజేపీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు
  • ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను కూల్చే ముందు ఆలోచించాలి
  • భూ కుంభకోణాలపై సిట్ నివేదిక బయటపెట్టాలి

ఏపీలో బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున నేతలు ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ నేత మాధవ్ వ్యాఖ్యానించారు. వైసీపీ సహా అన్ని పార్టీల నేతలు తమతో టచ్ లో ఉన్నారని అన్నారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కట్టడాల కూల్చివేత చూస్తుంటే, ఒక పార్టీ, కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్టు అనిపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను కూల్చే ముందు ఒకసారి ఆలోచించాలని సూచించారు. విశాఖపట్టణంలో భూ కుంభకోణాలపై సిట్ దర్యాప్తు నివేదికను బయటపెట్టాలని ఈ సందర్భంగా మాధవ్ డిమాండ్ చేశారు.

Andhra Pradesh
YSRCP
BJP
Madhav
  • Loading...

More Telugu News