Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ నివాసం వద్ద మరింత భద్రత
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-1d16d9e1ec1e61c0c8808180d46d29ca41b7037e.jpg)
- పలు అంశాల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం
- భద్రత నిమిత్తం వినియోగిస్తున్న డ్రోన్ కెమెరాలు
- జగన్ నివాసం చుట్టూ 200 మీటర్ల ప్రాంతంపై నిఘా
ఏపీ సీఎం జగన్ నివాసం వద్ద భద్రత మరింత పెరిగింది. జగన్ కు తమ సమస్యలను విన్నవించుకునేందుకు అర్జిదారులు వస్తుండటం, ఒక్కోసారి ఆయన కాన్వాయ్ వెళ్లే సమయంలో నిరసనకారులు నినాదాలు చేస్తుండటం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జగన్ నివాసం చుట్టూ రెండు వందల మీటర్ల ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాల సాయంతో పర్యవేక్షిస్తారు.