akash vijayavargiya: కన్నెర్ర చేసిన మోదీ... ఆకాశ్ విజయవర్గీయపై చర్యలకు సిద్ధమైన బీజేపీ

  • మున్సిపల్ అధికారులపై దాడి చేసిన ఆకాశ్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన మోదీ
  • నోటీసులు పంపేందుకు సిద్ధమైన బీజేపీ అధిష్ఠానం

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై అధికారమదంతో క్రికెట్ బ్యాట్ తో దాడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయ చిక్కుల్లో కూరుకుపోయారు. ఆకాశ్ చేసిన నిర్వాకం పట్ల ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. ఇలాంటి నాయకులు మనకు అవసరమా? అని ప్రశ్నించిన ఆయన... ఎంతటివారి కొడుకైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. మోదీ ఆగ్రహం నేపథ్యంలో, ఆకాశ్ కు నోటీసులు పంపించేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది. రేపు నోటీసులు పంపనున్నట్టు ఓ బీజేపీ అగ్రనేత తెలిపారు. ఆకాశ్ నుంచి వివరణ తీసుకుంటామని... ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ కుమారుడే ఆకాశ్.

akash vijayavargiya
kailash vijayavargiya
bjp
modi
  • Loading...

More Telugu News