Andhra Pradesh: టీడీపీ చేసిన అరాచకాలనే వైసీపీ కొనసాగిస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

  • పద్ధతి మార్చుకోకుంటే టీడీపీకి పట్టిన గతే పడుతుంది
  • బీజేపీ జెండా దిమ్మెల నిర్మాణాలను అడ్డుకోవడం తగదు
  • బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం

టీడీపీ చేసిన అరాచకాలనే వైసీపీ కొనసాగిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తన పద్ధతి మార్చుకోకుంటే టీడీపీకి పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వైసీపీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బీజేపీ జెండా దిమ్మెల నిర్మాణాలను అడ్డుకోవడం తగదని, బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోమని వైసీపీని హెచ్చరించారు.

‘ప్రత్యేక హోదా’ అంశం ముగిసిన అధ్యాయమని, ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని మరోమారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఈ నెల 6 నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని అన్నారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
Bjp
Kanna
  • Loading...

More Telugu News