Prakasam District: మరో రెండు వారాల్లో టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

  • వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటాం
  • నేను ఏ పదవిలో ఉన్నా ప్రకాశం అభివృద్ధికి కృషి చేస్తా
  • స్వామి వారి ఆభరణాల ప్రదర్శనపై నిర్ణయం తీసుకుంటాం

ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటామని, జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించడమే సీఎం జగన్ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి నిగ్గు తేలుస్తామని అన్నారు. ప్రజా సంక్షేమానికే జగన్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. తాను ఏ పదవిలో వున్నా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మరో రెండు వారాల్లో టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేస్తామని, తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో సంస్కరణలు తీసుకొస్తామని, స్వామి వారి ఆభరణాల ప్రదర్శన విషయంలో పీఠాధిపతులు, పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Prakasam District
TTD
chairman
YV Subba Reddy
  • Loading...

More Telugu News