India: రాజీనామాను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ!

  • సీడబ్ల్యూసీకి ఇప్పటికే రాజీనామా సమర్పణ
  • రాహుల్ రాజీనామాను తిరస్కరించిన సీడబ్ల్యూసీ
  • అయినా వెనక్కి తగ్గని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తిరస్కరించినా రాహుల్ వెనక్కి తగ్గలేదు. తాజాగా తన రాజీనామాను రాహుల్ గాంధీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

‘అద్భుతమైన భారత దేశానికి జవసత్వాలు అందించిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నాపై అపరిమితమైన ప్రేమ చూపిన దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. జైహింద్’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తన రాజీనామా లేఖను రాహుల్ జతచేశారు.

India
Congress
Rahul Gandhi
resign
Twitter
resignation letter posted
  • Loading...

More Telugu News