Andhra Pradesh: అంబటి రాయుడికి మద్దతుగా నిలిచిన హీరో సిద్ధార్థ్!

  • అంతర్జాతీయ క్రికెట్ కు అంబటి రాయుడు రిటైర్మెంట్
  • రాయుడు ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాడన్న సిద్ధార్థ్
  • అతని భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వ్యాఖ్య

తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మెట్ల నుంచి తప్పుకుంటున్నట్లు రాయుడు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో రాయుడికి ప్రముఖ నటుడు సిద్ధార్థ్ మద్దతుగా నిలిచాడు. ‘భారత దేశవాళీ క్రికెట్ ను గమనించేవారికి ఎవరికైనా రాయుడు తన కెరీర్ లో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాడో తెలుస్తుంది. అతను అద్భుతమైన ఆటగాడు. అతని అంతర్జాతీయ కెరీర్ మరింత ఉజ్వలంగా సాగి ఉండాల్సింది. ఇది నీ తప్పు కాదు రాయుడు. నీ భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.

అదే సమయంలో భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ వ్యవహారశైలిని కూడా హీరో సిద్ధార్థ్ తీవ్రంగా తప్పుపట్టాడు. ‘ఈరోజు నాకు ఐపీఎల్ కు తల్లి అయిన ఐసీఎల్(ఇండియన్ క్రికెట్ లీగ్) గుర్తుకువస్తోంది. ఓ లెజండ్ ఆటగాడిని అనుసరించి యువ క్రికెటర్లు అంతా అందులోకి అడుగుపెట్టారు. అప్పుడే బీసీసీఐ అన్యాయంగా ఆ లీగ్ ను మూసివేయించింది. దీంతో వందలాది మంది నైపుణ్యమున్న యువ క్రికెటర్లను తమ భవిష్యత్ కోసం పోరాడేలా చేసింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Andhra Pradesh
Telangana
cricket
ambati rayudu
retirement
siddarth
actoer
actor
asupport
  • Loading...

More Telugu News