jagan: జగన్ మంత్రివర్గంలో 23 మంది కోటీశ్వరులు.. 17 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
- రూ. 510 కోట్లతో అత్యంత ధనవంతుడిగా జగన్
- రెండు, మూడు స్థానాల్లో పెద్దిరెడ్డి, గౌతంరెడ్డి
- తొమ్మిది మంది మంత్రులపై సీరియస్ కేసులు
ఏపీ మంత్రివర్గంలోని 26 మంది మంత్రుల్లో (జగన్ సహా) 23 మంది కోటీశ్వరులు ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది. మంత్రివర్గంలో ఉన్న 17 మంది తమపై క్రిమినల్ కేసులు నమోదైనట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారని వెల్లడించింది. రూ. 510.38 కోట్లతో సీఎం జగన్ అత్యంత ధనవంతుడిగా ఉన్నారని తెలిపింది.
రూ. 130 కోట్లతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండో స్థానంలో వుండగా, మేకపాటి గౌతంరెడ్డి రూ. 61 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారని పేర్కొంది. మంత్రుల సరాసరి సంపద రూ. 35.25 కోట్లుగా ఉందని చెప్పింది. మిగిలిన ముగ్గురు మంత్రులు కూడా తమ సంపద కోటి కంటే ఎక్కువగానే ఉన్నట్టు ప్రకటించారని తెలిపింది.
ఇక మంత్రివర్గంలో 65 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. తొమ్మిది మంది మంత్రులు తమపై సీరియస్ కేసులు ఉన్నట్టు ప్రకటించారని తెలిపింది.