congress: ‘కాంగ్రెస్’లోనే ఉంటాను.. పార్టీని వీడే సమస్యే లేదు: రఘువీరారెడ్డి

  • మే 19న ఏపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశా
  • నా రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నా
  • ఏపీసీసీ బాధ్యతను మరొకరికి ఇవ్వాలి

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తన పదవికి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మే 19న ఏపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని, తన రాజీనామాను ఆమోదించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నానని అన్నారు. ఏపీసీసీ బాధ్యతను మరొకరికి ఇవ్వాలని చెప్పానని, ఎన్నికల ఫలితాలు రాకముందే రాజీనామా చేశానని అన్నారు. ‘కాంగ్రెస్’ లోనే ఉంటానని, పార్టీని వీడే సమస్యే లేదని స్పష్టం చేశారు.

congress
apcc
Raghuveera reddy
Resigns
  • Loading...

More Telugu News