Andhra Pradesh: చంద్రబాబును చూసి భోరున విలపించిన కుప్పం మహిళలు.. దగ్గరకు తీసుకుని ఓదార్చిన టీడీపీ అధినేత!

  • ఏపీ ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ
  • కుప్పంలో చంద్రబాబును కలుసుకున్న అభిమానులు, మద్దతుదారులు
  • బాబును చూడగానే కంటతడి.. ధైర్యం చెప్పిన అధినేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీ 23 స్థానాలకే పరిమితం అయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిని పలువురు అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా తన నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు ఈరోజు పర్యటించారు.

పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును చూడగానే పలువురు మహిళలు కన్నీటిపర్యంతం అయ్యారు. ఎన్నికల్లో ఇలా జరగడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ‘ధైర్యంగా ఉండండి.. ధైర్యంగా ఉండండి. మీ అందరికీ పార్టీ అండగా ఉంటుంది. భయపడొద్దు’ అని బాబు ధైర్యం చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News