mahie gill: పెళ్లి చేసుకోకుండానే కూతుర్ని కన్నాను.. తప్పేముంది?: హీరోయిన్ మహిగిల్

  • నేను రిలేషన్ షిప్ లో ఉన్నా
  • పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనడంలో సమస్య లేదు
  • పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది?

బాలీవుడ్ నటి మహిగిల్ సంచలన విషయాన్ని వెల్లడించింది. తనకు వెరోనికా అనే కూతురు ఉందని తెలిపింది. వచ్చే నెలలో తన బిడ్డకు రెండేళ్లు నిండుతాయని చెప్పింది. తాను ఇంత వరకు పెళ్లి చేసుకోలేదని... అయితే రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలిపింది. ఒక కూతురుకు తల్లినైనందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటానని తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది.

పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందని 43 ఏళ్ల మహిగిల్ ఈ సందర్భంగా ప్రశ్నించింది. మన ఆలోచనలు, సమయాన్ని బట్టి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. పెళ్లి చేసుకోకుండానే కుటుంబం, పిల్లల్ని కలిగిఉండవచ్చని తెలిపింది. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనడంలో ఎలాంటి సమస్య లేదని చెప్పింది. పెళ్లి చాలా అద్భుతమైనదని... అయితే పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది.

mahie gill
daughter
relationship
bollywood
  • Loading...

More Telugu News