Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో రోడ్డెక్కిన రైతన్న.. వేరుశనగ విత్తనాలు సరఫరా చేయాలంటూ రహదారి దిగ్బంధం!

  • తంబళ్లపల్లెలో ఆందోళనకు దిగిన రైతులు 
  • 2 గంటల పాటు రోడ్డుపై రాకపోకలు బంద్
  • పోలీసుల చొరవతో శాంతించిన రైతులు

వ్యవసాయ విత్తనాలు అందకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో ఈ రోజు రైతులు రోడ్డుపై బైఠాయించారు. తమకు వేరుశనగ విత్తనాలను ఇంతవరకూ వ్యవసాయ అధికారులు సరఫరా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని 2 గంటల పాటు రోడ్డును దిగ్బంధించారు.

దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి విత్తనాలు సరఫరా చేయిస్తామనీ, ఆందోళనను విరమించాలని రైతులను కోరారు. దీంతో శాంతించిన రైతన్నలు తమ ఆందోళనను విరమించారు. ఏపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, విత్తనాలకు కేటాయించాల్సిన మొత్తాన్ని అప్పటి సీఎం చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ప్రలోభాల స్కీములకు వాడేశారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News