Andhra Pradesh: నటుడు శివాజీ పాస్ పోర్టు సీజ్.. 11న మరోసారి విచారణకు రావాలని పోలీసుల ఆదేశం!

  • అమెరికాకు పారిపోతుండగా అదుపులోకి
  • సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసుల జారీ
  • కారులో ఇంటికి వెళ్లిపోయిన నటుడు శివాజీ

సైబరాబాద్ పోలీసులు ప్రముఖ నటుడు శివాజీని ఈరోజు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలంద మీడియా(టీవీ9) షేర్ల కొనుగోలు వ్యవహారంలో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో శివాజీ నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు పారిపోతుండగా, సైబరాబాద్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయన పాస్ పోర్టును సీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీచేశారు. జూలై 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం వదిలిపెట్టారు. దీంతో తన కారులో శివాజీ ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీఅయిన నేపథ్యంలో శివాజీని ఎయిర్ పోర్టులో గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు.

Andhra Pradesh
Telangana
tv9
alanda media
crpc 41 notice
Police
sivaji
actor
  • Loading...

More Telugu News