Imran khan: మాజీ ప్రధాని షరీఫ్, మాజీ అధ్యక్షుడు జర్దారీకి ఇమ్రాన్ ఖాన్ బంపరాఫర్!

  • అక్రమాస్తుల కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న షరీఫ్
  • దోచుకున్న డబ్బులు ఇచ్చేస్తే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లొచ్చన్న ఇమ్రాన్
  • షరీఫ్ విడుదల ప్రయత్నాలను బయటపెట్టిన ఇమ్రాన్

పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై తమ ప్రభుత్వ వైఖరి ఏంటో ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. వారిద్దరూ దోచుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేసి దేశం విడిచి వెళ్లపోవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు, రెండు సన్నిహిత దేశాల సాయంతో తమ తండ్రిని విడిపించుకునేందుకు షరీఫ్ కుమారులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.

అయితే, ఆ దేశాలు ఏవన్న సంగతిని ఇమ్రాన్ బయటపెట్టలేదు. ఈ విషయాన్ని ఆ దేశాలు తన దృష్టికి తీసుకొచ్చాయన్న ఇమ్రాన్.. షరీఫ్ విడుదలపై బలవంతం మాత్రం చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని ఆ దేశాధి నేతలు తనతో చెప్పారన్నారు.

‘‘వైద్య చికిత్స కోసం నవాజ్ షరీఫ్ విదేశాలకు వెళ్లాలంటే తొలుత ఈ దేశం నుంచి ఆయన దోచుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలి. అసిఫ్ అలీ జర్దారీకి కూడా ఇదే వర్తిస్తుంది. దోచుకున్న డబ్బును తిరిగి ఇచ్చాక వారు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపోవచ్చు’’ అని ఇమ్రాన్ స్పష్టంగా పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన నవాజ్ షరీఫ్ ఏడేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News