Hyderabad traffic police: ఇక నేలపైనే ట్రాఫిక్ సిగ్నల్స్.. కేబీఆర్ పార్క్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు

  • రోడ్డుపైనే ఏర్పాటు చేసిన సిగ్నళ్లు
  • వాహనదారులకు సరికొత్త అనుభూతి
  • వాహనదారుల నుంచి జీబ్రాక్రాసింగ్‌లకు విముక్తి

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను నేలకు దించి రోడ్డుపైనే ఏర్పాటు చేశారు. దీనివల్ల సిగ్నల్ జంపింగ్‌లకు అడ్డుకట్టపడడంతోపాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, కూడళ్ల వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగిపోతుందని చెబుతున్నారు. అనలాగ్, డిజిటల్ ల్యాబ్ సహకారంతో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు కూడలి వద్ద వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. జీబ్రా క్రాసింగ్ కంటే ముందే వీటిని ఏర్పాటు చేయడంతో సిగ్నల్ ఉల్లంఘనలు తగ్గనున్నాయి. తళుకులీనేలా ఉన్న ఇవి వాహనదారులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి.

ప్రస్తుతం కేబీఆర్ పార్క్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వీటిని త్వరలోనే నగరమంతా విస్తరించనున్నారు. ఈ సిగ్నళ్ల ఏర్పాటు వల్ల పాదచారులు రెడ్‌లైట్ దాటి ముందుకెళ్లే సాహసం చేయలేరు. ఒకవేళ వెళ్తే సిగ్నల్ జంప్ చేసినట్టే. అలాగే, వీటి ఏర్పాటు వల్ల జీబ్రాక్రాసింగ్‌‌‌లకు కొంత విముక్తి లభించనుంది. పాదచారులు ఇప్పుడు స్వేచ్ఛగా వాటిని ఉపయోగించుకుని రోడ్డు దాటవచ్చు.  

Hyderabad traffic police
Banjara hills
signal lights
KBR Park
  • Loading...

More Telugu News