Bangladesh: అడ్డుగోడలా ఉన్న షకీబల్ అవుట్... టీమిండియా శిబిరంలో ఆనందోత్సాహాలు

  • అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న బంగ్లా ఆల్ రౌండర్
  • బంగ్లాదేశ్ స్కోరు 34ఓవర్లలో 6 వికెట్లకు 179 రన్స్
  • విజయానికి 136 పరుగుల దూరంలో బంగ్లా

టీమిండియాతో మ్యాచ్ లో విశేషంగా ప్రభావం చూపించిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ ఎట్టకేలకు పాండ్యా బౌలింగ్ లో వెనుదిరిగాడు. తొలి మ్యాచ్ నుంచే భారీ ఇన్నింగ్స్ లు ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ తాజాగా భారత్ తో మ్యాచ్ లోనూ దూకుడు ప్రదర్శించాడు. 315 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ ను టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా దెబ్బతీస్తున్నా, షకీబల్ మాత్రం కొరకరాని కొయ్యలా పరిణమించాడు. అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న షకీబల్ జట్టును గెలుపుతీరాలకు చేర్చేందుకు మొండిగా పోరాటం మొదలుపెట్టినా, పాండ్య బంతికి అవుటయ్యాడు. దాంతో బంగ్లాదేశ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 34 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 16 ఓవర్లలో 136 పరుగులు చేయాలి. చేతిలో మరో 4 వికెట్లు ఉన్న స్థితిలో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

Bangladesh
India
World Cup
Cricket
  • Loading...

More Telugu News