India: ఒకే ఓవర్లో కోహ్లీ, పాండ్యలను అవుట్ చేసిన ముస్తాఫిజూర్... పంత్ దూకుడు

  • టీమిండియా 42 ఓవర్లలో 265/4
  • కేఎల్ రాహుల్ 77 అవుట్
  • భారీ స్కోరు దిశగా భారత్

బంగ్లాదేశ్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా 42 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లా లెఫ్టార్మ్ పేసర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ ఒకే ఓవర్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (26), హార్దిక్ పాండ్య (0)లను అవుట్ చేశాడు. అంతకుముందు, ఓపెనర్ కేఎల్ రాహుల్ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఇక, క్రీజులో ఉన్న రిషబ్ పంత్ తనదైన శైలిలో ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. పంత్ 32 బంతుల్లో 44 పరుగులతో ఆడుతున్నాడు. పాండ్య అవుట్ కావడంతో క్రీజులోకొచ్చిన ధోనీ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

India
Bangladesh
World Cup
  • Loading...

More Telugu News