Nara Lokesh: మాట్లాడితే తప్పులొస్తాయనే లోకేశ్ ట్వీట్లు చేస్తుంటారు: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

  • లోకేశ్ సరిగా మాట్లాడలేరు
  • ట్విట్టర్ లో లోకేశ్ కామెంట్లు ఎవరు రాస్తోరో అర్థంకావడంలేదు
  • టీడీపీ నేతలు తమ నాయకుడ్ని వెతుక్కుంటున్నారు

టీడీపీ యువనేత నారా లోకేశ్ పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. నారా లోకేశ్ సరిగా మాట్లాడలేరని, తాను మాట్లాడితే తప్పులు దొర్లుతాయనే ఎక్కువగా ట్వీట్లు చేస్తుంటారని ఎద్దేవా చేశారు. అసలు, లోకేశ్ తరఫున ట్విట్టర్ లో కామెంట్లు రాసేది ఎవరో అర్థంకావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబుపైనా అనిల్ కుమార్ యాదవ్ వ్యంగ్యం ప్రదర్శించారు. టీడీపీ నేతలు తమ నాయకుడ్ని వెతికే పనిలో ఉన్నారంటూ సెటైర్ వేశారు. వివాదాలు వీడిపోవాలనే సీఎం జగన్ గోదావరి జలాల తరలింపుపై నిర్ణయం తీసుకున్నారని, పోలవరం పనులేమీ ఆగలేదని కూడా అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

Nara Lokesh
Anil Kumar Yadav
YSRCP
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News