Sumalatha: జై జవాన్, జై కిసాన్... అంటూ లోక్ సభలో సుమలత తొలి ప్రసంగం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-16cd2e743a2cb97e33e932b075abdbd2bbb2b9f0.jpeg)
- మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సుమలత
- రైతుల సమస్యలపై గళం
- అన్నదాతలను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి
సినీ నటి సుమలత లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తొలిసారిగా లోక్ సభలో ఎంపీ హోదాలో ప్రసంగించారు. ప్రధానంగా రైతుల సమస్యలపై సుమలత ప్రసంగం సాగింది. లోక్ సభ జీరో అవర్ లో సుమలత తన ప్రసంగంలో ప్రధానంగా రైతుల ఆత్మహత్యలు, కరవు, నీటి సంక్షోభం, చెరకు, వరి రైతుల ఇబ్బందులను ప్రస్తావించారు. మాండ్యలో నీటి కొరత తీవ్రస్థాయికి చేరిందని, రైతులను అత్యవసర ప్రాతిపదికన ఆదుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చివర్లో జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేసి ప్రసంగాన్ని ముగించారు.