Team India: టెన్షన్ లేకుండా ఆడుతున్న రోహిత్ ను చూసి తాను కూడా బాదుడు మొదలుపెట్టిన కేఎల్ రాహుల్

  • బర్మింగ్ హామ్ లో టాస్ గెలిచిన టీమిండియా
  • బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ
  • శుభారంభం అందించిన రోహిత్, రాహుల్

బంగ్లాదేశ్ తో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఓపెనింగ్ ద్వయం రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూకుడు, నిలకడ సమ్మిళితంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. బర్మింగ్ హామ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, రోహిత్ శర్మ ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేశాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన కేఎల్ రాహుల్ కూడా ఓవర్లు గడిచేకొద్దీ బాదుడు షురూ చేశాడు. రోహిత్ శర్మ స్వేచ్ఛగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తుండడంతో రాహుల్ పై భారం తగ్గింది. దాంతో తాను సైతం ఎలాంటి ఒత్తిడి లేకుండా భారీ షాట్లకు తెరలేపాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 19 ఓవర్లలో 117  పరుగులు కాగా, రోహిత్ శర్మ 58, రాహుల్ 55 పరుగులతో ఆడుతున్నారు. రోహిత్ 4 ఫోర్లు, 3 సిక్సులు కొట్టగా, రాహుల్ 6 ఫోర్లు, ఒక సిక్స్ తో అలరించాడు.

Team India
Bangladesh
KL Rahul
Rohit Sharma
  • Loading...

More Telugu News