Andhra Pradesh: విజయసాయిరెడ్డి గారూ! మీకిది తెలుసా?: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • ‘చంద్రన్న బీమా’ గురించి ప్రస్తావించిన బుద్ధా వెంకన్న
  • ఈ పథకం గురించి పట్టించుకోరే?
  • 2.6 కోట్ల మంది ప్రజలకు ధీమా ఏదీ?

  టీడీపీపైనా, ఆ పార్టీ నేతలపైనా విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. టీడీపీ హయాంలోని ‘చంద్రన్న బీమా’ పథకం ప్రస్తుతం అమలు కాకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

‘వీఎస్ రెడ్డి- ఎంపీ గారూ! మీకిది తెలుసా? బీమా ప్రీమియం మోదీ గారు క‌ట్ట‌లేదు. మ‌న జ‌గ‌న‌న్న ప‌ట్టించుకోలేదు. 2.6 కోట్ల మంది ప్రజలకు ధీమా ఏదీ?బీమా పేరు ముందు ‘చంద్ర‌న్న’ పేరుంద‌నా?’ దీని గురించి పట్టించుకోవట్లేదు?

విజ‌య్ గారూ! అని ఎంతో ఆప్యాయంగా మోదీ గారు మిమ్మల్ని ప‌ల‌క‌రించారు. మీరు పుల‌క‌రించారు. ఈచ‌నువుతోనైనా బ‌డుగు బ‌తుకుల‌కు భ‌రోసా క‌ల్పించే బీమా ప్రీమియం చెల్లించే ఏర్పాటు చేయండి’ అని బుద్ధా వెంకన్న కోరారు.

Andhra Pradesh
Telugudesam
Mlc
Buddha
modi
pm
Bjp
mp
Vijayasai Reddy
chandranna bhina
  • Loading...

More Telugu News