Cow: గోమాత ఫుట్ బాల్ నైపుణ్యం... వీడియో మీరూ చూడండి!

  • మహారాష్ట్రలో విడ్డూరం
  • ఫుట్ బాల్ బంతి వద్దకు ఎవరినీ రానివ్వని ఆవు
  • బంతి ఎటువెళితే అటు పరుగులు పెట్టిన గోమాత

భారత్ లో ఫుట్ బాల్ ఎంతో కాలంగా ఆడుతున్నా, అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు చాలా తక్కువే. కొన్ని చిన్నదేశాలతో పోలిస్తే భారత్ లో సాకర్ ప్రమాణాలు చాలా తక్కువని చెప్పాలి. ఈ సంగతి పక్కనబెడితే మహారాష్ట్రలో వర్షాలు పడుతున్న సమయంలో ఓ ఆవు ఫుట్ బాల్ మైదానంలో బంతితో చేసిన విన్యాసాలు ఇప్పుడందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

 ఓ ప్రొఫెషనల్ ఫుట్ బాలర్ తరహాలో ఆ గోమాత బంతిని తన అత్యధిక సమయం తన అధీనంలో ఉంచుకున్న వైనం నిజంగా విస్మయం కలిగిస్తోంది. ముంబయి సమీపంలోని ఓ మైదానంలో కొందరు కుర్రాళ్లు ఫుట్ బాల్ ఆడుతుండగా, ఎంటరైన గోవు బంతిని తన కాళ్లతో తన్నుతూ, ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా హల్ చల్ చేసింది. ఆటగాళ్లు బంతి కోసం వెళితే ఆవు కోపంగా కాలు దువ్వుతూ బంతిని తంతూ నానా హంగామా చేసింది. బంతి ఎటువెళితే అటు పరుగులు తీస్తూ తాను కూడా ఆటలో లీనమైపోయినంతగా బిల్డప్ ఇచ్చింది.

Cow
Football
Soccer
Mumbai
Maharashtra
  • Error fetching data: Network response was not ok

More Telugu News