Nara Lokesh: పనిగట్టుకుని బురద చల్లితే వాస్తవాలు మరుగున పడతాయా?: నారా లోకేశ్

  • దేశంలోనే గరిష్టంగా 28 శాతం పెరుగుదల నమోదుచేశాం
  • రికార్డు స్థాయిలో రూ.20,746 కోట్ల జీఎస్టీ వసూళ్లు సాధించాం
  • అభివృద్ధి జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?

గత ప్రభుత్వం ఏపీని అన్ని విధాలా భ్రష్టు పట్టించిందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం పట్ల మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పనిగట్టుకుని బురద చల్లినంత మాత్రాన వాస్తవాలు మరుగున పడిపోవని స్పష్టం చేశారు. 2018-19 మధ్యకాలంలో రికార్డు స్థాయిలో ఏపీ రూ.20,746 కోట్ల జీఎస్టీ వసూళ్లను సాధించిందని, దేశంలోనే అత్యధికంగా 28 శాతం పెరుగుదలను నమోదు చేసిందని లోకేశ్ ట్వీట్ చేశారు. గత ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వచ్చిన రాష్ట్రం సాధించిన జీఎస్టీ ఘనతల వార్త క్లిప్పింగ్ ను కూడా లోకేశ్ తన ట్వీట్ లో పొందుపరిచారు.

  • Loading...

More Telugu News