marri sashidhar reddy: బీజేపీలో చేరుతున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్‌రెడ్డి

  • సిద్ధాంతాలు, విలువల విషయంలో రాజీపడను
  • గాడ్సే వారసులతో చేతులు కలపను
  • బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయం కండువా కప్పుకున్న నేపథ్యంలో, శశిధర్ రెడ్డికి సంబంధించిన వార్త కాంగ్రెస్ శిబిరంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ వార్తలపై శశిధర్ రెడ్డి స్పందించారు. సిద్ధాంతాలు, విలువల విషయంలో తాను రాజీపడే వ్యక్తిని కాదని ఆయన అన్నారు. తాను గాంధేయవాదినని, గాడ్సే వారసులతో చేతులు కలపడం అసాధ్యమని చెప్పారు. తాను పార్టీ మారుతున్నాననే వార్తల్లో నిజం లేదని... బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

marri sashidhar reddy
congress
bjp
  • Loading...

More Telugu News