BJP: లక్ష్మీపార్వతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కోటి బీజేపీలో చేరిక!

  • ఇప్పటికే కోటిపై ఫిర్యాదు చేసిన లక్ష్మీపార్వతి, పూనమ్ కౌర్
  • విచారణ దశలో ఉన్న కేసులు
  • విజయవాడలో కాషాయ కండువా కప్పుకున్న కోటి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత లక్ష్మీ పార్వతి తనను లైంగిక వేధింపులకు గురి చేసిందని ఇటీవల సంచలన కామెంట్లు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బీ కోటేశ్వరరావు అలియాస్ కోటి భారతీయ జనతా పార్టీలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన కోటి, కాషాయ కండువాను కప్పుకున్నారు. కాగా, కోటిపై బాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సైతం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కోటి తనపై దుష్ప్రచారం చేస్తూ, పరువుకు భంగం కలిగిస్తున్నాడని తెలంగాణ పోలీసులకు లక్ష్మీ పార్వతి ఫిర్యాదు చేయగా, ఆ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. అటువంటి సమయంలో కోటి బీజేపీలో చేరడం గమనార్హం.

BJP
Lakshmiparvati
Koti
Kanna
  • Loading...

More Telugu News