Rakulpreet Singh: ముంబై ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన రకుల్ ప్రీత్ సింగ్!

  • ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు
  • పలు విమాన సర్వీసుల రద్దు
  • ఎయిర్ పోర్టులో ఉన్నానని చెప్పిన రకుల్

గడచిన రెండు రోజులుగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగగా, సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విమానాశ్రయంలో చిక్కుకుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా తెలిపింది.

"ముంబై ఎయిర్‌ పోర్ట్‌ తెరిచి ఉందో లేదో ఎవరైనా సమాచారం అందిస్తారా?" అంటూ బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ పోలీసులను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేయగా, దానికి రకుల్ సమాధానం ఇచ్చింది. సోమవారం రాత్రి నుంచి ఒక్క విమానం కూడా కదల్లేదని, తాను ఎయిర్‌ పోర్ట్‌ లోనే ఉన్నానని చెప్పింది. కాగా, కుంభవృష్టి కారణంగా ముంబైకి వెళ్లాల్సిన పలు విమానాలను దారి మళ్లించగా, మరికొన్ని గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇంకో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Rakulpreet Singh
Mumbai
Airport
Rains
Sonam Kapoor
  • Loading...

More Telugu News