nagarjuna: కాజల్ అవకాశాన్ని తన్నుకుపోయిన పూజా హెగ్డే

  • 'మన్మథుడు 2'తో బిజీగా నాగార్జున
  •  త్వరలో సెట్స్ పైకి 'బంగార్రాజు'
  • నాగ్ మనవడి పాత్రలో చైతూ

నాగార్జున కథానాయకుడిగా 'బంగార్రాజు' రూపొందనుంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా కాజల్ ను తీసుకోవాలనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా పూజా హెగ్డే పేరు తెరపైకి వచ్చింది.

ఇటీవల కాలంలో వరుస విజయాలతో పూజా హెగ్డే క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అందువలన కాజల్ కి బదులుగా పూజా హెగ్డేను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇలా పూజా హెగ్డే మరో అవకాశాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున 'మన్మథుడు 2' చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత, ఆయన 'బంగార్రాజు' సెట్స్ పైకి రానున్నారు. ఈ సినిమాలో 'బంగార్రాజు' మనవడి పాత్రలో చైతూ కనిపించనున్నాడు. ఆయన జోడీగా ఎవరిని తీసుకుంటారో చూడాలి.

nagarjuna
pooja hegde
chaitu
  • Loading...

More Telugu News