Tamilnadu: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను లాడ్జికి తీసుకెళ్లి లోబరచుకున్న ఎస్ఐ!

  • కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానన్న స్థానిక నేత
  • నమ్మి బంగారాన్ని అప్పగించిన మహిళ
  • లోబరచుకుని కోరిక తీర్చుకున్న ఎస్ఐ

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి, ఆపై తనను మోసం చేశాడని ఓ వ్యక్తిపై ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీసు స్టేషన్ కు వచ్చిన మహిళను లోబరచుకునేందుకు లాడ్జికి తీసుకెళ్లిన ఎస్ఐపై వేటు పడింది. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా, శ్రీ వైకుంఠం సబ్‌ డివిజన్‌, తుంగనల్లూరు పరిధిలో జరిగింది. ఈ ప్రాంతంలోని ఓ మహిళ, తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం నిమిత్తం ఓ స్థానిక నాయకుడికి ఎనిమిది సవర్ల బంగారు నగలు ఇచ్చింది. ఆ నగలు తీసుకున్న అతను, ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేయగా, పోలీసులను ఆశ్రయించింది.

ఫిర్యాదు తీసుకున్న ఎస్‌ఐ, కేసు విచారణను పక్కనబెట్టి, ఆ మహిళను లోబరచుకున్నాడు. ఆమెను తీసుకుని తిరుచెందూరుకు వెళ్లి లాడ్జిలో మకాం వేశాడు. విషయం తెలుసుకున్న స్పెషల్‌ బ్రాంచి పోలీసులు, తమ రిపోర్ట్ ను తూత్తుకుడి ఎస్పీకి అందించగా, అతన్ని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tamilnadu
Police
Job
Local Leader
  • Loading...

More Telugu News