koneru konappa: మరో వివాదంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.. వైరల్ అవుతున్న వీడియో

  • సోదరుడు కృష్ణారావును బయటపడేసేందుకు ఎమ్మెల్యే ప్లాన్
  • గ్రామస్థులను ఇంటికి పిలిపించి సూచనలు చేసిన కోనప్ప
  • తాను చెప్పినట్టే విలేకరుల ముందు చెప్పాలని బెదిరింపు

ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితపై దాడిచేసిన కోనేరు కృష్ణారావును కేసు నుంచి తప్పించేందుకు ఆయన సోదరుడు, సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేసిన ప్రయత్నం ఒకటి వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. అనితపై దాడి కేసులో సాక్ష్యాలు తారుమారు చేయడానికి ఆయన ప్రయత్నించిన తీరు వివాదాస్పదమవుతోంది. దాడి విషయంలో మీడియా ముందు ఎలా మాట్లాడాలనే విషయాన్ని గ్రామస్థులకు ఆయన వివరిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది.  

వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. గ్రామస్థులను ఇంటికి పిలిపించిన ఎమ్మెల్యే కోనప్ప వారితో మాట్లాడుతూ.. విలేకరులను ఇంటికి పిలిపిస్తున్నానని, తాను చెప్పినట్టే వారివద్ద మాట్లాడాలని బెదిరించారు. తప్పంతా అధికారులదేనని, తమ భూముల వద్దకు వెళ్లకుండా బెదిరిస్తున్నారని వారితో చెప్పాలని కోనప్ప సూచించారు. అంతేకాదు, 15 రోజుల క్రితం అధికారులు వచ్చి తమపై దాడి చేశారని కూడా చెప్పాలని కోనప్ప చెప్పడం స్పష్టంగా వినిపిస్తోంది.

ఆదివారం అధికారులు మరోమారు తమపై దాడిచేశారని, ఆ ఘటన తర్వాతే తాము భూముల వద్దకు వెళ్లి దున్నకుండా ట్రాక్టర్లను అడ్డుకున్నామని చెప్పాలని గ్రామస్థులకు సూచించారు. మహిళా అధికారిపై దాడి చేసిన సోదరుడిని కేసు నుంచి బయటపడేసేందుకు గ్రామస్థులను ప్రభావితం చేస్తుండడం ఇప్పుడు కొత్త వివాదానికి కారణమైంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News