Tamilnadu: మన్మోహన్‌సింగ్‌కు రాజ్యసభ స్థానాన్ని అడిగిన కాంగ్రెస్.. తిరస్కరించిన డీఎంకే!

  • తమిళనాడులో ఈ నెల 18న ఎన్నికలు
  • ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నిర్వహణ
  • డీఎంకేకు ముగ్గురు అభ్యర్థులను పంపించే అవకాశం

త్వరలో తమిళనాడులో ఆరు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకేకు తమ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులను రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. దీంతో ఒక స్థానాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్ఠానం డీఎంకేను కోరింది.

అయితే, ఈ విన్నపాన్ని డీఎంకే తిరస్కరించింది. అంతేకాదు, తమ పార్టీ తరుపున పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేసింది. ఒక స్థానాన్ని కార్మిక సంఘం ప్రతినిధి అయిన ఎం. షన్ముగంకు, మరో స్థానాన్ని ఎండీఎంకే అధినేత వైగోకు, మరో స్థానాన్ని సీనియర్ అడ్వకేట్ పి. విల్సన్‌కు డీఎంకే కేటాయించింది.

Tamilnadu
DMK
Rajyasabha
Manmohan Singh
Shanmugam
Wilson
  • Loading...

More Telugu News