Chandrababu: దాడులకు గురైన కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు: సోమిరెడ్డి

  • టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి
  • ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
  • కార్యకర్తలకు అండగా జిల్లాకో కమిటీ

రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు గురైన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శిస్తారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య తెలిపారు. నేడు టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను సోమిరెడ్డి, వర్ల రామయ్య మీడియాకు వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీడీపీ కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరిగాయన్నారు. కుప్పం పర్యటన అనంతరం చంద్రబాబు దాడులకు గురైన కుటుంబాలను పరామర్శించి, ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారని తెలిపారు. అలాగే పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు జిల్లాకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీంతో పాటు కాల్ సెంటర్‌ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని సోమిరెడ్డి, వర్ల రామయ్య తెలిపారు.

Chandrababu
Telugudesam
Somireddy
Varla Ramaiah
Kuppam
YSRCP
  • Loading...

More Telugu News