chandrababu: చంద్రబాబుకు మెజార్టీ తగ్గడానికి కారణమిదే: పర్సనల్ సెక్రటరీ మనోహర్

  • నాయకుల మధ్య సఖ్యత లేదు
  • ఇగో సమస్యల వల్లే మెజార్టీ తగ్గింది
  • ఈవీఎంల మాయాజాలం కూడా కారణమే

నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇగో సమస్యల వల్లే కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మెజార్టీ తగ్గడానికి కారణమని ఆయన పర్సనల్ సెక్రటరీ పి.మనోహర్ తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ఈవీఎంల మాయాజాలమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని అన్నారు. కోటపల్లి, కడపల్లి పోలింగ్ బూత్ లలో వీవీప్యాట్లను లెక్కించాలని కోరినా అధికారులు నిరాకరించారని... ఈవీఎంలలో ఉన్న మతలబే దానికి కారణమని చెప్పారు.

చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని... ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని... అయినా, టీడీపీ ఓడిపోవడం ఆశ్చర్యపరుస్తోందని అన్నారు. రేపు, ఎల్లుండి కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

chandrababu
majority
manohar
Telugudesam
kuppam
  • Loading...

More Telugu News