Andhra Pradesh: ఆదర్శ రాజకీయాలు, నిండైన తెలుగుదనానికి వెంకయ్య నాయుడు నిలువెత్తు రూపం!: నారా లోకేశ్

  • ఆయన తెలుగువారి అభ్యున్నతిని కాంక్షించారు
  • జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తికి ప్రతీకగా రాణిస్తున్నారు
  • వెంకయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ నేత

ఆదర్శ రాజకీయాలకు, నిండైన తెలుగుదనానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిలువెత్తు రూపమని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. వెంకయ్య నాయుడు జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తికి ప్రతీకగా రాణిస్తున్నారని చెప్పారు. తెలుగువారి అభ్యున్నతిని కాంక్షించే ప్రగతిశీలి, మానవతావాది వెంకయ్య నాయుడని వ్యాఖ్యానించారు. ఈరోజు వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు.

ఈరోజు ట్విట్టర్ లో నారా లోకేశ్ స్పందిస్తూ..‘ఆదర్శ రాజకీయాలకు, నిండైన తెలుగుదనానికి నిలువెత్తు రూపంగా, జాతీయస్థాయిలో తెలుగువారి కీర్తికి ప్రతీకగా రాణిస్తూ, అన్నివేళలా తెలుగువారి అభ్యున్నతిని కాంక్షించే ప్రగతిశీలి, మానవతావాది, ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
Venkaiah Naidu
birthday wishes
Twitter
  • Loading...

More Telugu News