kabir singh: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న హిందీ 'అర్జున్ రెడ్డి'.. ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందంటే..!

  • నిన్నటి వరకు రూ. 181.57 కోట్లు వసూలు చేసిన 'కబీర్ సింగ్'
  • నిన్న ఇండియా మ్యాచ్ ఉన్నా తగ్గని ఊపు
  • షాహిద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్

టాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి'ని 'కబీర్ సింగ్' పేరుతో దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. నిన్నటి వరకు రూ. 181.57 కోట్లను వసూలు చేసి... రూ. 200 కోట్ల క్లబ్ లో చేరే దిశగా అడుగులు వేస్తోంది. 2019లో మూడో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా 'కబీర్ సింగ్' నిలిచింది. నిన్న ఇండియా, ఇంగ్లండ్ ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ ఉన్నప్పటికీ... ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. శుక్రవారం రూ. 12.21 కోట్లు, శనివారం రూ. 17.10 కోట్లు, ఆదివారం రూ. 17.84 కోట్లను వసూలు చేసింది. ఈ వివరాలను బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన కైరా అద్వానీ నటించింది. షాహిద్ కెరీర్లోనే ఈ చిత్రం భారీ హిట్ గా నిలిచింది.


kabir singh
collections
bollywood
shahid kapoor
  • Loading...

More Telugu News