Andhra Pradesh: టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై సమీక్షకు కమిటీని ఏర్పాటు చేసిన సీఎం జగన్!

  • 9 మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
  • కమిటీలో సభ్యులుగా బుగ్గన, బాలినేని, అజయ్ కల్లం
  • సౌర, పవన విద్యుత్ ధరలను సమీక్షించనున్న కమిటీ

టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయనీ, దీనిపై తాము విచారణ జరిపిస్తామని అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జగన్ అప్పుడు చెప్పినట్లే చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లు, అందుకు చేసుకున్న ఒప్పందాలపై సమీక్షకు 9 మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేశారు.

ఈ కమిటీకి ట్రాన్స్ కో సీఎండీ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. అలాగే ఈ కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీ అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ టీడీపీ ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన సౌర, పవన విద్యుత్ ధరలను సమీక్షించనుంది. అదే సమయంలో డిస్కంలకు తక్కువ ధరకు విద్యుత్ ను అమ్మేవారితో చర్చలు జరపనుంది.

Andhra Pradesh
Jagan
committee
electricity prices
Chief Minister
highlevel committee
wind and solar electricity
  • Loading...

More Telugu News