Karnataka: సరదాగా వీడియోగ్రఫీ కోసం అడవికి వెళితే.. వెంటపడిన పులి!

  • బతుకు జీవుడా అంటూ పరుగందుకున్న ఇద్దరు స్నేహితులు
  • ద్విచక్ర వాహనం శబ్దానికి రోడ్డుపైకి వచ్చిన టైగర్‌
  • కర్ణాటక కొల్లేగా అటవీ ప్రాంతంలో ఘటన

అటవీ ప్రాంతాన్ని సందర్శించాలి. అక్కడి మూగజీవాలను గమనించాలి. వీడియో తీయాలి.. వంటి ఆలోచనలతో మోటారు బైక్‌పై అడుగుపెట్టిన ఇద్దరు స్నేహితులకు అనుకోని ప్రమాదం ఎదురు కావడంతో పైప్రాణాలు పైనే పోయాయి. అడవిలోకి వెళ్లి వీడియో తీస్తుండగా వీరి బండి శబ్దానికి పొదల్లో విశ్రాంతి తీసుకుంటున్న పులి రోడ్డుపైకి వచ్చింది. వీరిని చూడగానే వెంబడించడంతో బతుకు జీవుడా అంటూ పరుగందుకున్నారు.

కర్ణాటక రాష్ట్రం గుండ్లుపేట నుంచి ఇద్దరు స్నేహితులు కేరళకు వెళుతూ బండీపుర మూలెహోళ అటవీ చెక్‌పోస్టు దాటి కొళ్లేగా అటవీ ప్రాంతం లోపలికి వెళ్లారు. వీడియో తీస్తుండగా పులి వచ్చి వెంబడించింది. అయితే బైక్‌ నడిపిన వ్యక్తి వేగంగా వాహనాన్ని పరుగెత్తించడంతో వీరికి ప్రాణాపాయం తప్పింది. కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటన వీడియోను కేరళ వాసులు అప్‌లోడ్‌  చేయడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇది జోరుగా సర్క్యులేట్‌ అవుతోంది.

Karnataka
Kerala
kollega forest area
two friends
tiger
  • Loading...

More Telugu News