Andhra Pradesh: టీడీపీ నేతలు మాపై దాడులు చేస్తున్నారు.. ఏపీ డీజీపీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు!

  • ఈరోజు డీజీపీ సవాంగ్ తో సమావేశమైన ఎమ్మెల్యే
  • సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని వ్యాఖ్య
  • పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న సవాంగ్

వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో భేటీ అయ్యారు. ఏపీలో టీడీపీ నేతలు వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. కాబట్టి టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే సోషల్ మీడియాలో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరితతో పాటు మంత్రులు, ఇతర నేతలపై కొందరు అనుచిత పోస్టులు పెడుతున్నారనీ, వీటిపై కూడా ద‌ృష్టి సారించాలని కోరారు. ఈ మేరకు ఓ లేఖను ఆళ్ల రామకృష్ణారెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ కు అందజేశారు. కాగా, ఈ ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
attacks
alla ramakrishna reddy
ap dgp
sawang
complaint
  • Loading...

More Telugu News