Buddha Venkanna: వాళ్లు మీ నాన్న కోసం చనిపోలేదా?: జగన్ కు బుద్ధా వెంకన్న సూటి ప్రశ్న

  • 2014 తరువాత మృతులకు సాయమేది?
  • మిగిలిన వాళ్లకు సాయం చేయని జగన్
  • ట్విట్టర్ వేదికగా బుద్ధా వెంకన్న

తన తండ్రి మరణించిన తరువాత, మనస్తాపంతో వందలాది మంది చనిపోయారంటూ, ఓదార్పు యాత్ర చేసిన జగన్, 2014లో ఓడిపోయిన తరువాత మిగిలిన వాళ్లకు సహాయం చేయలేదని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ట్వీట్ పెడుతూ, వాళ్లంతా వైఎస్ కోసం చనిపోయిన వారు కాదా? అని ప్రశ్నించారు.

"ఓదార్పు పేరుతో ఓవర్ యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ మీ మహామేతగారి తనయుడు జూనియర్ మేత గారు. నాన్నారు కోసం చనిపోయారంటూ చాంతాడంత లిస్ట్ మీ సలహాతో విడుదల చేసారు. ఓదార్పు సహాయం కొంత మందికే ఇచ్చి 2014 ఓటమి తరువాత మిగిలిన వాళ్లకి ఎందుకు ఎగ్గొట్టారు? వాళ్ళు నాన్నారు కోసం చనిపోయినవారు కాదా?" అని అడిగారు. ఆపై "అక్రమ సాయి రెడ్డి (@VSReddy_MP ) గారూ.. పెయిడ్ ఆర్టిస్ట్ కి పర్యాయపదం అయిన మీరు, రాజధాని రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానపరిచినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు" అని హెచ్చరించారు. 

Buddha Venkanna
Twitter
Jagan
Vijay Sai Reddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News