Supreme Court: ఆరు వారాల సెలవుల తర్వాత నేడు తెరుచుకున్న సుప్రీంకోర్టు
- మే 13 నుంచి నిన్నటి వరకు వేసవి సెలవులు
- 31 మంది జడ్జిలతో నేటి నుంచి పని చేయనున్న సుప్రీంకోర్టు
- పలు కీలక కేసులను విచారించనున్న సుప్రీం
ఆరు వారాల వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు నేడు తెరుచుకుంది. మే 13 నుంచి నిన్నటి వరకు సెలవుల కారణంగా సర్వోన్నత న్యాయస్థానం మూతపడింది. ఈరోజు పలు కేసులను సుప్రీంకోర్టు విచారించనుంది. వీటిలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కోర్టు ధిక్కార కేసు, అయోధ్య-బాబ్రీ మసీదు స్థల పంపకాల వివాదం, రాఫెల్ యుద్ధ విమానాల డీల్ కు సంబంధించిన రివ్యూ పిటిషన్ తదితర కేసులు ఉన్నాయి. 31 మంది జడ్జిలతో సుప్రీంకోర్టు నేటి నుంచి పూర్తి స్థాయిలో పని చేయనుంది. పాత జడ్టిలతో పాటు ఇటీవలే నియమితులైన జస్టిస్ బీఆర్ గవాయ్, సూర్యకాంత్ లు కూడా విధులను చేపట్టనున్నారు.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై కూడా నేడు సుప్రీం విచారించనుంది. ఈ అంశానికి సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసే అవకాశం ఉంది. కొత్త రోస్టర్ సిస్టం ప్రకారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, ఎన్వీ రమణ, అరుణ మిశ్రా, జస్టిస్ నారీమన్ లు విచారించనున్నారు.